Donald Trump: అణుయుద్ధం చేసే ప‌రిస్థితి వస్తే పూర్తి సైనిక శక్తిని వినియోగిస్తాం: ట‌్రంప్‌

  • ఆసియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అమెరికా అధ్య‌క్షుడు
  • ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడితో భేటీ
  • ఉత్త‌ర కొరియాకు హెచ్చ‌రిక‌లు
  • ఉ.కొరియా నియంత కిమ్ బెదిరింపుల ధోరణిని నియంత్రిస్తాం

ఆసియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ జ‌పాన్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌క్షిణ కొరియాలో ఉన్నారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌తో సమావేశ‌మైన అనంత‌రం డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ... ఉత్త‌ర‌కొరియాను హెచ్చ‌రించారు. ఉత్తర కొరియాతో అణుయుద్ధం చేసే ప‌రిస్థితి వస్తే తమ పూర్తి సైనికశక్తిని వినియోగిస్తామని అన్నారు. ఉత్త‌ర‌కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌ బెదిరింపుల ధోరణిని నియంత్రిస్తామ‌ని కూడా చెప్పారు. ఆయ‌న చేస్తోన్న‌ బెదిరింపులకు భయపడబోమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ త‌మ దేశానికి వ‌చ్చిన నేప‌థ్యంలో ద‌క్షిణ కొరియా ఆయ‌న‌కు రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికింది. ఆసియాలో డొనాల్డ్ ట్రంప్ మొత్తం 12 రోజులు ప‌ర్య‌టించ‌నున్నారు. 

More Telugu News