idea: ఐడియా ఆఫ‌ర్‌.. రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 1జీబీ డేటా

  • నిన్న రూ.357 ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఐడియా
  • ఈ రోజు మ‌రో ప్లాన్‌
  • 28 రోజుల కాల వ్య‌వ‌ధితో ఉన్న రెండు ఆఫ‌ర్‌లు

వినియోగ‌దారుల‌ను మ‌రింత ఆక‌ర్షించేందుకు ఐడియా సెల్యూల‌ర్ నిన్న రూ.357 ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ ప్లాన్‌తో రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా, అప‌రిమిత‌ లోకల్, ఎస్టీడీ కాల్స్, ప్ర‌తిరోజు 100 ఎస్ఎమ్ఎస్‌లు (28 రోజుల కాలవ్యవధితో) ఆఫర్ చేసింది. ఈ రోజు ఐడియా మ‌రో ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 1జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్ కూడా 28 రోజుల కాల వ్య‌వ‌ధితోనే ఉంటుంది.

రూ.357తో రీచార్జ్ చేసుకుంటే వ‌చ్చే ఉచిత‌ ఎస్టీడీ కాల్స్‌, ప్ర‌తిరోజు 100 ఎస్ఎమ్ఎస్‌లు మాత్రం రూ.179 ప్లాన్‌తో రావు. ఐడియా సెల్యులర్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శశి శంకర్ ఈ విష‌యంపై మీడియాతో మాట్లాడుతూ... వాయిస్‌ కాల్స్‌ను అధికంగా చేసుకునే ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. ఇటీవ‌లే వొడాఫోన్ కూడా రూ.177తో ఇటువంటి ప్లానే ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.

More Telugu News