Aishwarya Rai: వెయ్యి మంది విద్యార్థుల‌కు సంవ‌త్స‌రం పాటు ఉచిత భోజనం... దాతృత్వం చూపించిన ఐశ్వ‌ర్య‌రాయ్‌

  • 44వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఐష్ సంఘ‌సేవ‌
  • ఇస్కాన్ వారి అన్నామృత ఫౌండేష‌న్ ద్వారా అమ‌లు
  • 2004 నుంచి ఈ ప‌థకాన్ని న‌డుపుతున్న ఇస్కాన్‌

త‌న 44వ పుట్టిన రోజు (న‌వంబ‌ర్ 1) సంద‌ర్భంగా వెయ్యి మంది పాఠ‌శాల విద్యార్థుల‌కు సంవ‌త్స‌రం పాటు ఉచిత భోజ‌నం అంద‌జేసే కార్య‌క్ర‌మానికి న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ శ్రీకారం చుట్టింది. ఇంట‌ర్నేష‌నల్ సొసైటీ ఫ‌ర్ కృష్ణా కాన్షియ‌స్‌నెస్ (ఇస్కాన్‌) వారి మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అన్నామృత ఫౌండేష‌న్ ద్వారా ఆమె ఈ కార్య‌క్ర‌మాన్ని అమలు చేయ‌నుంది.

ఈ ప‌థ‌కం ద్వారా ముంబైలోని 500 మున్సిప‌ల్ పాఠ‌శాల‌ల్లో, మ‌హారాష్ట్రలోని 2000కి పైగా పాఠ‌శాల‌ల్లో ఇస్కాన్ వారు ఈ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా మంచి పోష‌కాహారాన్ని విద్యార్థుల‌కు అంద‌జేస్తున్న‌ట్లు ఇస్కాన్ ప్ర‌తినిధి రాధానాథ్ స్వామి మ‌హ‌రాజ్ తెలిపారు. 900 మంది విద్యార్థుల‌కు భోజ‌న అవ‌స‌రాలు తీర్చ‌డానికి 2004లో చిన్న గ‌దిలో ప్రారంభ‌మైన ఈ ప‌థ‌కం, ఇవాళ దేశ‌వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో దాదాపు 12 ల‌క్ష‌ల మంది విద్యార్థుల ఆక‌లిని తీరుస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News