Rare black truffle: చాలా కాస్ట్లీ... ఈ పుట్టగొడుగు కేజీ లక్షన్నర!

  • అరుదైన, పుట్టగొడుగుల్లోనే అత్యంత రుచికరమైన బ్లాక్‌ ట్రఫుల్‌ (నల్ల పుట్టగొడుగు) సాగు
  • ఇంగ్లండ్‌ లోని మాన్ మౌత్ షైర్ లోని ఓ సింధూర చెట్టు వేళ్ల మధ్య ఈ బ్లాక్ ట్రఫుల్ సాగు
  • కేజీ బ్లాక్ ట్రఫుల్ ధర 1,50,000 రూపాయలు

పుట్టగొడుగుల పెంపకం పెరిగిన నేపథ్యంలో ఏ సీజన్ లో అయినా ఇవి మనకు దొరుకుతున్నాయి. పోషకాల పరంగా ఎంతో విలువైనవని పేర్కొనే ఈ పుట్టగొడుగులు, సాధారణంగా కేజీ 200 నుంచి 500 వరకు లభ్యమవుతాయి. అయితే ఇంగ్లండ్ లో అరుదైన, పుట్టగొడుగుల్లోనే అత్యంత రుచికరమైన బ్లాక్‌ ట్రఫుల్‌ (నల్ల పుట్టగొడుగు) ను సాగు చేసి సంచలనం సృష్టించారు.

ఇంగ్లండ్‌ లోని మాన్ మౌత్ షైర్ లోని ఓ సింధూర చెట్టు వేళ్ల మధ్య ఈ బ్లాక్ ట్రఫుల్ ను సాగు చేశారు. మధ్యదరా సముద్రం ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ బ్లాక్‌ ట్రఫుల్‌ అత్యంత ఖరీదైనది. దీనిని గుర్తించిన వెంటనే జన్యు విశ్లేషణలకు పంపారు. అనంతరం దీనిని బ్లాక్‌ ట్రఫుల్‌ గా నిర్ధారించారు. కేజీ బ్లాక్‌ ట్రఫుల్‌ ధర అక్షరాల లక్షా యాభైవేల రూపాయలని వారు తెలిపారు. 

More Telugu News