ఉత్తరకొరియా: ఉత్తరకొరియాపై సహనంగా ఉండే కాలం పోయింది: జపాన్‌లో డొనాల్డ్ ట్రంప్

  • ఆ దేశ‌ అణు పరీక్షలు ప్రపంచానికి ప్ర‌మాద‌క‌రం
  • ట్రంప్ చేసిన‌ వ్యాఖ్యలకు జపాన్‌ ప్రధానమంత్రి మద్దతు
  • ఉ.కొరియా విష‌యంలో సైనిక పరంగా కూడా సాయం చేస్తాం: షింజో అబే

వ‌రుస‌గా క్షిప‌ణి ప్ర‌యోగాలు చేస్తోన్న ఉత్త‌ర‌కొరియాపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. జపాన్‌ పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రధాని షింజో అబేతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.... ఉత్తరకొరియాపై సహనంగా ఉండే కాలం పోయిందని వ్యాఖ్యానించారు. ఉత్త‌ర‌కొరియా చేస్తోన్న‌ అణు పరీక్షలు ప్రపంచానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు.

డొనాల్డ్‌ ట్రంప్ చేసిన‌ వ్యాఖ్యలకు జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే కూడా మద్దతు పలికారు. ఉత్త‌ర‌కొరియాను అదుపు చేసేందుకు అమెరికా తీసుకునే నిర్ణయాలకు తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పారు. సైనిక పరంగా కూడా తాము సాయం చేస్తామ‌ని అన్నారు.   

More Telugu News