bigboss: హిందీ బిగ్‌బాస్‌లో ఊహించ‌ని ప‌రిణామం... ఎలిమినేట్ అయిన ఢించ‌క్ పూజ‌

  • ఇటీవ‌లే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఢించ‌క్‌
  • వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వ‌చ్చిన పూజ‌
  • అస్స‌లు ఊహించ‌లేద‌న్న యూట్యూబ్ స్టార్‌

రెండు వారాల క్రితం వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఢించ‌క్ పూజ ఎలిమినేట్ అయిన‌ట్లు ఆదివారం రాత్రి స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించ‌గానే చాలా మంది కంగుతిన్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య అడుగుపెట్టిన ఢించ‌క్, ఇంత త్వ‌ర‌గా బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లిపోతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. తాను కూడా అస్స‌లు ఊహించ‌లేద‌ని యూట్యూబ్ స్టార్ తెలిపింది.

హితేన్ తేజ్వాని, ప్రియాంక్ శ‌ర్మ‌, స‌ప్నా చౌద‌రి, శిల్పా షిండే, హీనా ఖాన్, బెనాఫ్షా సూన‌వాలా, స‌బ్య‌సాచి స‌త్ప‌తి, బంద్గీ ఖ‌ల్రాల‌తో క‌లిపి పూజ కూడా ఎలిమినేష‌న్‌కి నామినేట్ అయింది. అయితే వీరంద‌రిలోనూ పూజ ఎలిమినేట్ అవ‌డం ఓ ర‌కంగా ఊహించ‌ని ప‌రిణామ‌మే. ఇలా ఎలిమినేట్ అవ‌డం కూడా ఓ రకంగా మంచే జ‌రిగింద‌ని పూజ అంది. తాను బిగ్‌బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఇత‌ర కంటెస్టంట్లు త‌న‌ను టార్గెట్ చేశార‌ని, అర్షి ఖాన్‌, ఆకాశ్ ద‌డ్లానీ మిన‌హా మిగ‌తా కంటెస్టంట్లు ఎవ‌రూ త‌న‌తో క‌లిసేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌లేద‌ని పూజ తెలిపింది.

అందుకే అర్షి ఖాన్‌ను కాపాడ‌టం కోసం గ‌త‌వారం త‌న‌ను తాను నామినేట్ చేసుకున్న‌ట్లు పూజ వెల్ల‌డించింది. ఇంట్లో ఎవ‌రికి త‌గ్గ‌ట్లుగా వారు గేమ్ ఆడుతున్నార‌ని, హీనా ఖాన్‌, హితేన్ తేజ్వాని, శిల్పా షిండే, ప్రియాంక్ శ‌ర్మ‌లు సందర్భానికి త‌గ్గ‌ట్లుగా తెలివిగా ఆడుతున్నార‌ని చెప్పింది. బిగ్‌బాస్ ఇంట్లో తాను పాడిన పాట‌ను ఆద‌రించినందుకు అంద‌రికీ పూజ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

More Telugu News