america: కాల్పులు జరిపింది ఉగ్రవాది కాదు... అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి!

  • సదర్ ల్యాండ్ స్పింగ్స్ లోని బాప్టిస్ట్ చర్చ్ లో కాల్పులకు తెగబడిన డెవిన్ కెల్లీ ఉగ్రవాది కాదు
  • డెవిన్ కెల్లీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి
  • 2010 నుంచి 2014 వరకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేశాడు 

అమెరికాలోని టెక్సాస్ లో సదర్ ల్యాండ్ స్పింగ్స్ లోని బాప్టిస్ట్ చర్చ్ లో 50 నుంచి 60 మంది గుమికూడి ప్రార్థనలు చేస్తున్న సమయంలో సైనిక దుస్తుల్లో చొరబడి తుపాకి తూటాల వర్షం కురిపించిన డెవిన్ కెల్లీ ఉగ్రవాది కాదని అమెరికా భద్రతాధికారులు తెలిపారు. డెవిన్ కెల్లీ అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అని వారు వెల్లడించారు.

అయితే ఆయన ప్రవర్తన మంచిది కాకపోవడంతో విధుల నుంచి తొలగించబడ్డాడని వారు పేర్కొన్నారు. 2010 నుంచి 2014 మధ్య కాలంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వర్తించాడని వారు తెలిపారు. అతనికి, ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధాలు లేవని వారు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కేసును ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తుందని ట్రంప్ ప్రకటించారు. 

More Telugu News