India: భారతీయుడి జోస్యంతో బెంబేలెత్తిపోతున్న పాకిస్థాన్!

  • డిసెంబర్ 31 నాటికి హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం
  • ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన కేరళ జ్యోతిష్యుడు బాబూ కాలాయిల్
  • ఈ భూకంపం 11 దేశాలపై పెను ప్రభావం

భారతీయ జ్యోతిష్యుడు చెప్పిన జోస్యం పాకిస్థాన్ ను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళకు చెందిన బాబూ కాలాయిల్ అనే జ్యోతిష్యుడు ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటికల్లా హిందూమహాసముద్రంలో భారీ భూకంపం సంభవిస్తుందని సెప్టెంబర్ 20న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇంకా ఆ లేఖలో ఈ భూకంపం ధాటికి భారత్, పాకిస్థాన్, చైనా సహా మొత్తం 11 దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు.

దీనిని పీఎంవో పెద్దగా పట్టించుకోలేదు. కానీ పాకిస్థాన్ మాత్రం సీరియస్ గా తీసుకుంది. భూకంపం కారణంగా సునామీలాంటివి సంభవిస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తోంది. దీంతో ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పాక్‌ పీఎంవో ఆధ్వర్యంలో పనిచేసే ‘భూకంపాలు, పునరావాసం, పునర్నిర్మాణ ప్రాధికార సంస్థ’(ఎర్రా) వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలతో పాటు, బాబూ కాలాయిల్ పీఎంవోకి రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

More Telugu News