paradise papers leake: పారడైజ్ పేపర్స్ లీక్: విదేశాలకు భారీగా సొమ్ము తరలించిన కెనడా ప్రధాని సలహాదారు!

  • ప్రపంచ ప్రముఖుల మెడకు ప్యారడైజ్ పేపర్స్ లీక్
  • చిక్కుల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ, క్వీన్ ఎలిజబెత్
  • ఒక్కొక్కటిగా బయటకొస్తున్న పేర్లు

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలకు న్యాయ సేవలు అందించే ‘అప్లెబీ’ నుంచి లీకైన సమాచారం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల మెడకు చుట్టుకుంటోంది. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించి పెట్టుబడులు పెట్టిన వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం 13.4 మిలియన్ పేపర్లు లీక్ కాగా అందులో 180 దేశాలకు చెందిన కుబేరులు ఉన్నారు. వీరిలో 174 మంది భారత మిలియనీర్లు కూడా ఉండడం గమనార్హం.

అంతేకాదు, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కూడా పది మిలియన్ పౌండ్లను తరలించినట్టు ఆరోపణలు వస్తుండగా, ఈ జాబితాలో కెనడా ప్రధాని పేరు కూడా కనిపించింది. ప్రధాని జస్టిన్ ట్రూడూ సీనియర్ సలహాదారు అయిన  స్టీఫెన్ బ్రాన్ఫ్‌మాన్ పెద్ద ఎత్తున విదేశాలకు నిధులు తరలించినట్టు పారడైజ్ పేపర్స్ వెల్లడించాయి. పన్నులకు స్వర్గధామమైన దేశాలకు కుటుంబ వ్యాపారం ద్వారా ఆ సొమ్మును తరలించినట్టు పేపర్ల ద్వారా వెల్లడైంది.
 

More Telugu News