kenya: ఉగ్రవాదిగా భావించి భారత సంతతి వ్యాపారిని కాల్చేసిన పోలీసులు

  • ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా సిబ్బంది
  • భద్రతా సిబ్బందిని ఉగ్రవాదులుగా భావించి, గాల్లోకి కాల్పులు జరిపిన బంటీ షా
  • బంటీ షాను ఉగ్రవాదిగా భావించి కాల్చిచంపిన భద్రతా సిబ్బంది

కెన్యా రాజధాని నైరోబీలో దారుణం చోటుచేసుకుంది. గత నెల చోటుచేసుకున్న ఈ దారుణానికి సంబంధించిన నివేదిక విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు కెన్యా ప్రభుత్వం అందించింది. దాని వివరాల్లోకి వెళ్తే...భారత సంతతికి చెందిన బంటీ షా (32) కెన్యాలోని వెస్ట్ ల్యాండ్స్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.

 అక్టోబర్ 21న ఈ ప్రాంతంలో కెన్యా పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. దానిని చూసిన బంటీ షా...చొరబాటుదారులేమో అని భావించి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అప్పటికే ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది అతనిని ఉగ్రవాదిగా భావించి కాల్చి చంపేశారు. దీనిపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను భారత ప్రభుత్వానికి కెన్యా ప్రభుత్వం అందజేసింది. అనంతరం బంటీషా కుటుంబాన్ని ఆదుకునేందుకు అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని వారు తెలిపినట్టు సుష్మా స్వరాజ్ తెలిపారు. 

More Telugu News