Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అందంగా ఉన్నంత మాత్రాన చాలదంటున్న రాశి 
  • 'సైరా' తొలి షెడ్యూలు హైదరాబాదులోనే! 
  • కార్తీ చిత్రంలో సాయేశా సైగల్ 
  • వెంకటేశ్ బర్త్ డే రోజున తేజ సినిమా మొదలు  

*  'కేవలం అందంగా ఉన్నంత మాత్రాన హీరోయిన్ గా నెట్టుకురాలేం..' అంటోంది కథానాయిక రాశిఖన్నా. "అందంగా వుంటే చాలు, దక్షిణాది సినిమాల్లో సక్సెస్ అయిపోవచ్చని మొదట్లో అనుకునే దానిని. అయితే, ఆ తర్వాత తెలిసింది, అందం ఒక్కటే చాలదని, అభినయం కూడా కావాలని. ఈ రెండూ ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను" అని చెప్పింది రాశి.      
*  మెగాస్టార్ చిరంజీవి నటించే 'సైరా' చిత్రం షూటింగ్ డిసెంబర్ 6 నుంచి జరుగుతుంది. తొలి షెడ్యూలును హైదరాబాదులోనే నిర్వహించడానికి ప్లాన్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నాడు.
*  'అఖిల్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన సాయేశా సైగల్ ప్రస్తుతం తమిళంలో బిజీ అవుతోంది. ఇప్పటికే అక్కడ కొన్ని చిత్రాలు చేసిన ఈ చిన్నది తాజాగా కార్తీ సరసన నటించనుంది. ఈ చిత్రం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది.
*  వెంకటేశ్, తేజ కాంబినేషన్లో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెంకటేశ్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రం షూటింగును డిసెంబర్ 13న లాంఛనంగా ప్రారంభిస్తారు.     

More Telugu News