gang rape: ఇలాంటి వారికి బతికే అర్హత లేదు.. ఉరి తీయండి!: గ్యాంగ్ రేప్ బాధితురాలు

  • అందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరి తీయండి
  • నన్ను కిడ్నాప్ చేస్తున్నా పోలీసులు కాపాడలేదు
  • పోలీస్ అధికారి కుమార్తె అని చెప్పకపోతే, నన్ను చంపేసేవారు

వీరెవరికీ సమాజంలో బతికే హక్కు లేదని... అందరూ చూస్తుండగా వీరిని బహిరంగంగా ఉరి తీయాలని భోపాల్ గ్యాంగ్ రేప్ బాధితురాలు డిమాండ్ చేశారు. అత్యాచార ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఘటనా స్థలికి దగ్గర్లోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ పోలీసులు తనను కాపాడలేక పోయారని... తనను కిడ్నాప్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కళ్లు మూసుకున్నారని మండిపడ్డారు.

తాను పోలీసు అధికారి కుమార్తెనని చెప్పకపోయి ఉంటే... అత్యాచారం తర్వాత తనను హత్య చేసి ఉండేవారని ఆమె తెలిపారు. హబీబ్ గంజ్ పోలీస్ అధికారుల ప్రవర్తన చాలా దారుణంగా ఉందని ఆమె విమర్శించారు. మరోవైపు ఈ కేసు విషయంలో అలసత్వం వహించిన ఐదుగురు పోలీసులను ఇప్పటికే విధుల నుంచి తొలగించారు. అంతేకాక, కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు టీమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న పోలీసు అధికారి కుమార్తె అయిన బాధితురాలిపై నలుగురు యువకులు మూడు గంటలపాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే.

More Telugu News