male pregnancy: పురుషులు కూడా గర్భం దాల్చొచ్చు, పిల్లల్ని కనొచ్చు!

  • పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టొచ్చు
  • సిజేరియన్ ద్వారా ఆపరేషన్
  • పిండం ఎదగడానికి కృత్రిమంగా హర్మోన్లు

 పురుషులు కూడా గర్భం దాల్చి, పిల్లల్ని కనే రోజు దగ్గర్లోనే ఉందని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. మగవారు పిల్లల్ని కనడానికి పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవని అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ రిచర్డ్ పాల్సన్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న పురుషులు... గర్భాశయ మార్పిడికి కూడా ముందుకు రావచ్చని ఆయన అన్నారు. మగవారికి అవసరమైన మందులు మార్కెట్లలో విరివిగా ఉన్నాయని... దీని కారణంగా మగవారు పిల్లలను కనొచ్చని చెప్పారు.

టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో జరిగిన సంఘం వార్షిక సమావేశంలో పాల్సన్ మాట్లాడుతూ, లింగ మార్పిడి అనంతరం పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. అయితే పురుషులు, స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం విభిన్నంగా ఉంటుందని... ఈ కారణం వల్ల పురుషుల్లో సాధారణ కాన్పు సాధ్యం కాదని తెలిపారు. సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతిసిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయని... ఈ హార్మోన్లను పురుషులకు కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

More Telugu News