ifatf: అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ను మరోసారి దోషిగా నిలబెట్టిన భారత్

  • ఐఎఫ్ఏటీఎఫ్ రివ్యూ సమావేశంలో ఉగ్ర అంశాన్ని లేవనెత్తిన భారత్
  • అడ్డుకునే ప్రయత్నం చేసిన చైనా
  • ఆంక్షలు విధించాలన్న స్పెయిన్ తదితర దేశాలు

ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్ ను భారత్ మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆయుధ, ఆర్థిక సహకారాన్ని అందిస్తోందంటూ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఐఎఫ్ఏటీఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న జమాత్ ఉద్ దవా, లష్కరేతాయిబా సంస్థల ఆస్తులను వెంటనే సీజ్ చేయాలని స్పష్టం చేసింది.

భారత్ లో ఈ ఉగ్ర సంస్థలు చేస్తున్న చర్యలకు సంబంధించి పాక్ ను ప్రశ్నించింది. ఈ సంస్థలతో పాటు పాక్ గడ్డపై ఉన్న ఇతర ఉగ్ర సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో 2018 ఫిబ్రవరి లోపు తమకు నివేదిక అందించాలంటూ ఆదేశించింది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో ఐఎఫ్ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 2, 3 తేదీల్లో రివ్యూ మీటింగ్ జరిగింది.

ఈ సమావేశంలో ఉగ్ర సంస్థలకు పాకిస్థాన్ అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని భారత్ ప్రశ్నించింది. మరోవైపు భారత్ లేవనెత్తుతున్న ప్రశ్నలను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. ఈ సందర్భంగా స్పెయిన్ తో పాటు పలు దేశాలు పాకిస్థాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాయి.

More Telugu News