mohammed siraj: భావోద్వేగంతో మైదానంలో కంటతడి పెట్టిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్

  • తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సిరాజ్
  • క్యాప్ అందించిన రవిశాస్త్రి
  • చేదు అనుభవాన్ని మిగిల్చిన తొలి మ్యాచ్

గత ఏడాది ఐపీఎల్ తోనే స్టార్ క్రికెటర్ గా మారిన హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్. 2015 వరకు టెన్నిస్ బంతితో గల్లీ క్రికెట్ ఆడిన ఈ కుర్రాడు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే టీమిండియా జట్టులో సభ్యుడిగా ఎదిగాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ కు మందు హెడ్ కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా సిరాజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. గల్లీ క్రికెట్లో కష్టాలు గుర్తుకొచ్చాయో లేదా తాను అనుభవించిన కటిక పేదరికం గుర్తొచ్చిందో లేక వాళ్ల అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయో కానీ... చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.

మరోవైపు, తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ సిరాజ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. భయపడుతూనే బౌలింగ్ ను స్టార్ట్ చేశాడు. తొలి ఓవర్ తొలి బంతికే ఫోర్ ఇచ్చాడు. మొత్తం నాలుగు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడో ఓవర్ రెండో బంతికి కివీస్ కెప్టెన్ విలియంసన్ ను పెవిలియన్ కు చేర్చడం సిరీజ్ కు కాస్త ఊరట. ఈ మ్యాచ్ లో భారత్ 40 పరుగుల తేడాతో ఓడిపోవడం కూడా సిరాజ్ కు మింగుడుపడని అంశమే. కెరీర్ ఆరంభంలో ఆటగాళ్లకు ఇలాంటి చేదు అనుభవాలు మామూలే. దీన్ని, అధిగమించి రానున్న రోజుల్లో సిరాజ్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి.

More Telugu News