siddharth: మొత్తానికి సిద్ధార్థ్ కి హిట్ దక్కేసింది!

  • తమిళ .. హిందీ భాషల్లో సిద్ధార్థ్ హారర్ థ్రిల్లర్ 
  • నిన్ననే భారీస్థాయిలో విడుదల
  • రెండు భాషల్లోను హిట్ టాక్ 
  • వచ్చేవారం తెలుగులోకి  

చాలా కాలంగా సిద్ధార్థ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన సొంత బ్యానర్ పై ఒక సినిమాను నిర్మించాడు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని కారణాల వలన తెలుగులో రిలీజ్ ను వాయిదా వేశాడు గానీ, తమిళ .. హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాడు.

 ఈ రెండు భాషల్లోను ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియాలో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమాను గురించి చెప్పుకోవడం .. రివ్యూస్ లోను మంచి రేటింగ్ రావడం విశేషం. ఈ సినిమాతో .. చాలాకాలంగా సిద్ధార్థ్ వెయిట్ చేస్తోన్న హిట్ లభించినట్టేనని చెప్పుకుంటున్నారు. వచ్చేవారం తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా 'గృహం' పేరుతో పలకరించనుంది.    

More Telugu News