kichidi: 800 కేజీల కిచిడీ రెడీ... గిన్నిస్ రికార్డు కూడా రెడీ!

  • ఘుమఘుమలాడే కిచిడీ తయారు చేసిన షెఫ్ సంజీవ్ కపూర్
  • వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌లో రికార్డు
  • ట్విట్ట‌ర్‌లో ఫొటోలు

ఢిల్లీలో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా వేడుక‌లో 800 కేజీల కిచిడీని త‌యారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ కిచిడీని పాక శాస్త్ర నిపుణుడు, చీఫ్ షెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ తయారు చేశారు. ఈ వేడుక‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ కూడా ఆయ‌నే. కిచిడీ త‌యారీ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్‌ కౌర్‌, సాధ్వీ నిరంజన్‌, యోగా గురువు బాబా రాందేవ్‌లు కూడా హాజ‌ర‌య్యారు. కిచిడీ తయారీలో వారు కూడా చేతులు కలిపారు.

ఇటీవ‌ల ఈ రికార్డు నేప‌థ్యంలో కిచిడీని జాతీయ వంట‌కంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందంటూ పుకార్లు వ‌చ్చాయి. అయితే దీనిపై స్ప‌ష్ట‌తనిస్తూ కేంద్ర మంత్రి హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 800 కిలోల కిచిడీని చేసేందుకు సుమారు వెయ్యి లీటర్ల గిన్నెను ఉప‌యోగించారు. న‌వంబ‌ర్ 5వ తేదీతో ఈ వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా వేడుక ముగియ‌నుంది.

More Telugu News