Smart phones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వెల్లువ.. మూడో త్రైమాసికంలో 40 కోట్ల విక్రయాలు!

  • అమ్మకాల్లో సత్తా చాటిన టాప్-10 బ్రాండ్లు
  • మార్కెట్‌లో అత్యధిక శాతం వాటా సొంతం
  • భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా ఫోన్లకు గిరాకీ

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఏకంగా 40 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయాయి. వీటిలో 75 శాతం మార్కెట్ వాటాను టాప్-10 కంపెనీలు సొంతం చేసుకున్నాయి. మొత్తం 600 బ్రాండ్లు మార్కెట్లోకి రాగా, ప్రముఖ బ్రాండ్ల ఫోన్లకే ఎక్కువ ఆదరణ లభించినట్టు శుక్రవారం విడుదలైన ‘మార్కెట్ మానిటర్’ తాజా నివేదిక బట్టి తెలుస్తోంది.

చైనా బ్రాండ్స్ అయిన షియోమీ, వివో, ఒప్పో, హువేయిలు అత్యంత వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లుగా నిలిచాయి. అలాగే శాంసంగ్, ఆపిల్, ఎల్‌జీలు కూడా ఈ త్రైమాసికంలో సత్తా చాటాయి. ఇండియా, దక్షిణాసియా దేశాల్లో చైనా బ్రాండ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఆయా దేశాల మార్కెట్లలో చైనా బ్రాండ్లు టాప్-5లో ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

More Telugu News