Himachalpradesh: సూపర్ ఫిట్‌నెస్.. క్రీజులో ఏకంగా 16.55 గంటల పాటు గడిపేసిన హిమాచల్‌ప్రదేశ్ కెప్టెన్!

  • రెండో రోజు క్రీజులోకి వచ్చి చివరి రోజు వరకు క్రీజులోనే 
  • మొత్తం 16.55 గంటలు బ్యాటింగ్ చేసిన నాయర్ 
  • ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘ బ్యాటింగ్

క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిట్‌నెస్ నిరూపించుకోలేని కారణంగా దిగ్గజ క్రికెటర్లు సైతం పలుమార్లు జట్టులో చోటు కోల్పోయారు. ఇంకొందరైతే ఇదే కారణంతో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతుంటారు. అయితే హిమాచల్‌ప్రదేశ్ జట్టు కెప్టెన్ అయిన రాజీవ్ నాయర్ తనలో ఫిట్నెస్ టన్నుల కొద్దీ ఉందని నిరూపించాడు. క్రీజులో ఏకంగా 1,015 నిమిషాలు (16.55 గంటలు) నిలిచి రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యంత సుదీర్ఘమైన ఇన్నింగ్స్.

రంజీట్రోఫీలో భాగంగా జమ్ము కశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాజీవ్ ఈ ఘనత సాధించాడు. నవంబరు 3, 1999న ఈ మ్యాచ్ ముగియగా ఇన్నింగ్స్‌లో రెండో రోజు క్రీజులోకి వచ్చిన నాయర్ చివరి రోజు వరకు క్రీజులోనే ఉన్నాడు. మొత్తం 728 బంతులు ఎదుర్కొన్న నాయర్ 271 పరుగులు చేశాడు. క్రికెట్ గణాంకాల విశ్లేషకుడు అభిషేక్ ముఖర్జీ ఈ వివరాలను మీడియాకు తెలిపారు.

More Telugu News