jana reddy: ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని నేనెప్పుడు చెప్పా?: జానారెడ్డి

  • అవిశ్వాసం పెడతామని నేను అనలేదు
  • చెప్పిన వారినే అడగండి
  • సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని తను చెప్పలేదని... చెప్పినవారినే ఆ విషయం గురించి అడగాలని తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదని... వారికి నచ్చిన అంశాలనే ప్రభుత్వం చర్చకు తీసుకొస్తోందని మండిపడ్డారు.

రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యోగాల భర్తీ, ఇళ్ల నిర్మాణంపై చర్చకు వెనకాడుతోందని తెలిపారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈనాటి సమావేశాల్లో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇంటర్ విద్య, వ్యవసాయం, కొత్త రహదారులు, నకిలీ విత్తనాలు తదితర అంశాలపై మంత్రులు సమాధానాలు ఇచ్చారు. కేసీఆర్ కిట్లపై కూడా చర్చ జరిగింది. 

More Telugu News