Sachin Tendulkar: కారులో వెళుతూ ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు సందేశం ఇచ్చిన స‌చిన్ టెండూల్క‌ర్‌.. మీరూ చూడండి!

  • బైకు నడిపేవారే కాకుండా వెన‌క కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి
  • ద‌య‌చేసి హెల్మెట్ పెట్టుకోవ‌డాన్ని అల‌వాటుగా చేసుకోండి
  • ఇది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం

గ‌తంలో హైద‌రాబాద్‌లోని ఓ ర‌హ‌దారిపై కారులో వెళుతూ మాజీ క్రికెటర్ స‌చిన్ టెండూల్క‌ర్ ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు మంచి సందేశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళుతోన్న వేళ త‌ప్ప‌కుండా హెల్మెట్ పెట్టుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. తాజాగా అచ్చం అలాగే కారులో వెళుతూ ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు మ‌రోసారి సందేశం ఇచ్చారు స‌చిన్‌. ఈ సారి ఇంకాస్త ముందుకు వెళ్లారు. బైకుని న‌డిపే వారే కాకుండా వారి వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల‌ని, ఇద్ద‌రి ప్రాణాలూ ముఖ్య‌మేక‌దా అని పేర్కొన్నారు.

ఇది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మేన‌ని చెప్పారు. ద‌యచేసి హెల్మెట్‌ను పెట్టుకోవడం ఒక అల‌వాటుగా మార్చుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సచిన్ టెండూల్క‌ర్ ఏ ప్రాంతంలో వెళుతూ ఈ సందేశం ఇచ్చారో తెలియాల్సి ఉంది. 

More Telugu News