'ఏంటింత కూల్?' అని ఉత్తమ్ అడిగితే... 'నా టెన్షన్ నీకు తగులుకుందిగా?' అంటూ ఎర్రబెల్లి స్ట్రోక్!

03-11-2017 Fri 12:40
  • తెల్లబోయే సమాధానాన్ని ఇచ్చిన ఎర్రబెల్లి
  • తనకున్న టెన్షన్స్ పోయాయని వ్యాఖ్య
  • అన్నీ ఉత్తమ్ చుట్టూ చేరాయన్న ఎర్రబెల్లి
చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును చూసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానికి కారణాన్ని అడిగిన వేళ, తెల్లబోయే సమాధానం వచ్చింది. ఈ ఉదయం అసెంబ్లీ లాబీలో ఇద్దరు నేతలూ ఎదురుపడగా, చోటు చేసుకున్న వీరి సంభాషణ ఇప్పుడు మీడియాలో వైరల్ అయింది.

తొలుత ఉత్తమ్ గడ్డంపైకి వెళ్లిన టాపిక్, ఆపై ఎర్రబెల్లి వైపు వచ్చింది. "ఏంటింత కూల్ గా కనిపిస్తున్నావ్?" అని ఉత్తమ్ ఎర్రబెల్లిని అడుగగా, "నాకు ఉన్న టెన్షన్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు నీకు అవే టెన్షన్స్ మొదలయ్యాయి" అని అన్నారు. రేవంత్ రెడ్డి కాగ్రెస్ లోకి రావడం అన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవులకు చేటు తెస్తుందన్న విధంగా ఎర్రబెల్లి వ్యాఖ్యానించడం గమనార్హం.