delhi high court: అలా తాకితే లైంగిక వేధింపని అనలేం!: ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్

  • అనుకోకుండా తాకితే లైంగిక వేధింపు అనలేం 
  • సీఆర్ఆర్ఐ శాస్త్రవేత్త కేసులో న్యాయమూర్తి వ్యాఖ్య
  • తప్పుడు ఫిర్యాదులు ఇవ్వవద్దని మహిళా సైంటిస్టుకు మందలింపు
  • ప్రతి విషయాన్నీ లైంగిక వేధింపుగా చూడలేమన్న న్యాయమూర్తి

అనుకోకుండా ఓ మహిళను తాకితే దాన్ని లైంగిక వేధింపుగా నిర్ధారించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని సీఆర్ఆర్ఐ (సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) మాజీ శాస్త్రవేత్తపై లైంగిక వేధింపులు జరిగాయని దాఖలైన కేసులో జస్టిస్ విభు భక్రూ విచారణ జరిపి, తీర్పును వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు వచ్చిన ఉన్నతోద్యోగి, తన సహోద్యోగినిని తాకిన మాట వాస్తవమేనని, కానీ అప్పటి పరిస్థితుల్లో దాన్ని వేధింపుగా భావించడం లేదని స్పష్టం చేశారు.

కంపెనీలు, కార్యాలయాల్లో పని చేసుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పొరపాటున ఒకరిని ఒకరు తాకే అవకాశాలున్నాయని, అంతమాత్రాన ప్రతి విషయాన్నీ లైంగిక వేధింపుగా భావించలేమని, అయితే, మహిళలపై వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేనని వ్యాఖ్యానించారు.

కాగా, ఏప్రిల్ 2005లో తనను సహోద్యోగి తాకాడని ఆరోపిస్తూ, ఓ మహిళా సైంటిస్టు ఫిర్యాదు చేయగా, ఈ కేసు విచారణకు వచ్చింది. సదరు మహిళ ల్యాబ్ లో పనిచేస్తుంటే వచ్చిన ఉన్నతోద్యోగి చెయ్య పట్టుకుని పక్కకు లాగి, శాంపిల్స్ ను కింద పడేసి, రూము నుంచి బయటకు నెట్టాడు. సదరు అధికారి ఆమె పనిని అడ్డుకున్నాడే తప్ప, లైంగికంగా వేధించలేదని, ఇలా ఫిర్యాదు చేయడం సరికాదని మహిళా సైంటిస్టును న్యాయమూర్తి మందలించడం గమనార్హం.

More Telugu News