hit refresh: తెలుగులో రానున్న‌ స‌త్య నాదెళ్ల పుస్త‌కం `హిట్ రీఫ్రెష్‌`!

  • త‌మిళ, హిందీ భాష‌ల్లో కూడా
  • న‌వంబ‌ర్ 7న మార్కెట్లోకి
  • హైద‌రాబాద్ నుంచి అమెరికా వ‌ర‌కు త‌న ప్ర‌యాణాన్ని వివ‌రించిన నాదెళ్ల‌

మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ల రాసిన `హిట్ రీఫ్రెష్‌` అనే పుస్త‌కం త్వ‌ర‌లో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లకానుంది. ఇంగ్లిషులో బెస్ట్ సెల్ల‌ర్‌గా నిలిచిన ఈ పుస్త‌కంలో హైద‌రాబాద్ నుంచి అమెరికాలోని రెడ్మండ్ వ‌ర‌కు త‌న ప్ర‌యాణాన్ని నాదెళ్ల వివ‌రించారు. క్లౌడ్ కంప్యూటింగ్‌, మైక్రోసాఫ్ట్ 365, విండోస్ 10 వంటి విప్ల‌వాత్మ‌క ఉత్ప‌త్తుల‌ను త‌య‌రుచేయ‌డంలో త‌న‌ భార‌త మూలాలు ఎలా ఉప‌యోగ‌ప‌డ్డాయో నాదెళ్ల ఈ పుస్త‌కంలో వివ‌రించారు. `హిట్ రీఫ్రెష్‌` హిందీ పుస్త‌కాన్ని హ‌ర్పర్ కొలిన్స్ ఇండియా ప్ర‌చురిస్తుండ‌గా, తెలుగు, త‌మిళ వెర్ష‌న్ల‌ను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్ర‌చురిస్తోంది. న‌వంబ‌ర్ 7న ఈ వెర్ష‌న్లు మార్కెట్లో విడుద‌ల‌కానున్న‌ట్లు స‌మాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సత్య నాదెళ్ల ఈ నెల 6, 7 తేదీల్లో ఢిల్లీ, హైదరాబాదు నగరాల్లో పర్యటిస్తారు. 

More Telugu News