virat kohli: ఐసీసీ స్పందనతో సద్దుమణిగిన కోహ్లీ వివాదం!

  • డగౌట్ లో వాకీటాకీ వాడిన కోహ్లీ
  • నిబంధనలను ఉల్లంఘించాడంటూ తీవ్ర ఆరోపణలు
  • అనుమతితోనే ఉపయోగించాడంటూ ఐసీసీ వివరణ

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నిన్న న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ వ్యవహారం వివాదాస్పదమైంది. డగౌట్ లో జట్టు సభ్యులతో పాటు కూర్చున్న కోహ్లీ వాకీటాకీలో మాట్లాడాడు. మ్యాచ్ జరుగుతుండగా వాకీటాకీ వాడటంపై వివాదం చెలరేగింది. ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ప్రవర్తించాడనే ప్రచారం జరిగింది. డగౌట్ లో కానీ, డ్రెస్సింగ్ రూమ్ లో కానీ ఆటగాళ్లను సంప్రదించేందుకు జట్టు సహాయక సిబ్బంది వాకీటాకీ ఉపయోగిస్తుంటారు. మరోపక్క, కోహ్లీ వ్యవహారం ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు కూడా అనుమానాలను రేకెత్తించింది.

ఈ నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. వాకీటాకీని వినియోగించడానికి సంబంధిత అధికారి పర్మిషన్ ను కోహ్లీ తీసుకున్నాడని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు. ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక విభాగం అనుమతితోనే వాకీటాకీని వాడాడని చెప్పారు. దీంతో, వివాదం సద్దుమణిగింది. 

More Telugu News