Accident: బైక్‌పై వెళుతుండ‌గా ప్ర‌మాదం.. వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న వైనం.. వీడియో!

  • చైనాలోని గుయియాంగ్ ప్రాంతంలో ఘ‌ట‌న‌
  • సీసీటీవీ ఫుటేజ్ విడుద‌ల‌
  • వెంట‌నే బైకుని వ‌దిలేసి త‌ప్పించుకున్న వాహ‌న‌దారుడు

చైనాలోని గుయియాంగ్ ప్రాంతంలో ఓ వ్య‌క్తి బైక్‌పై వెళుతూ ప్ర‌మాదానికి గుర‌య్యాడు. అదృష్టం బాగుండి వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ర‌ద్దీగా ఉన్న ర‌హదారిపై బైకుపై వెళుతోన్న ఆ వ్య‌క్తి త‌న వాహ‌నాన్ని ఎడ‌మ‌వైపున‌కు మ‌ళ్లించాడు. అయితే, వెన‌క‌నుంచి ఓ భారీ ట్ర‌క్కు ఆప‌కుండా వ‌చ్చేయ‌డంతో ఆ వ్య‌క్తి త‌న బైకుతో పాటు ట్ర‌క్కు ముందు ప‌డిపోయాడు.

వెంట‌నే బైకుని వ‌దిలేసి ప‌క్క‌కు జ‌రిగాడు. ఆ ట్ర‌క్కుకింద ప‌డిన బైకు మాత్రం అలాగే కొన్ని మీట‌ర్ల వ‌ర‌కు వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో వాహ‌న‌దారుడికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ‌గానే అక్క‌డి నుంచి లేచి వెళ్లిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్క‌డి పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఆ వాహ‌న‌దారుడి పేరు ఇంకా తెలియ‌రాలేదు.

More Telugu News