nara rohith: 'బాలకృష్ణుడు' విడుదల తేదీని ఖరారు చేసేశారు!

  • 'బాలకృష్ణుడు'గా నారా రోహిత్
  • దర్శకుడిగా పవన్ మల్లెల 
  • కథానాయికగా రెజీనా
  • ఫ్యాక్షన్ ప్రేమకథ నేపథ్యం  

నారా రోహిత్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శమంతకమణి' ఫరవాలేదనిపించుకుంది. ఆ తరువాత 'బాలకృష్ణుడు' సినిమాతో అభిమానులను పలకరించడానికి నారా రోహిత్ రెడీ అవుతున్నాడు.

 పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించింది. హైదరాబాద్ - కర్నూల్ చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ ప్రేమకథగా ఈ సినిమా కొనసాగుతుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు కంటే ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా నారా రోహిత్ కనిపిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమా సక్సెస్ పై ఇటు నారా రోహిత్ .. అటు రెజీనా ఇద్దరూ కూడా ఆశలు పెట్టుకున్నారు.         

More Telugu News