padmavathi: 'ప‌ద్మావ‌తి' విడుద‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌నున్న బీజేపీ

  • ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌, సీబీఎఫ్‌సీకి కూడా లేఖ రాయాల‌ని నిర్ణ‌యం
  • క్ష‌త్రియ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా ఉందంటూ ఆరోప‌ణ‌
  • వెల్ల‌డించిన బీజేపీ ప్ర‌తినిధి ఐకే జ‌డేజా

సంజయ్‌లీలా భ‌న్సాలీ ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మించిన 'ప‌ద్మావ‌తి' చిత్ర విడుద‌లను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి లేఖ రాయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు బీజేపీ ప్ర‌తినిధి ఐకే జ‌డేజా తెలిపారు. సీబీఎఫ్‌సీ, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కి లేఖ ప్ర‌తిని పంపించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

సినిమాలో కొన్ని స‌న్నివేశాలు క్ష‌త్రియ వ‌ర్గ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. మ‌హారాణి ప‌ద్మావ‌తి, కోపిష్టి అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీల మ‌ధ్య సంబంధాన్ని త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేసి, చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని ఐకే జ‌డేజా అన్నారు. అందుకే స‌మ‌స్య సద్దుమ‌ణిగే వ‌ర‌కు సినిమా విడుద‌లను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని కోరుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే ఇలా లేఖ రాయ‌డానికి సామాజిక ఉద్దేశ‌మే త‌ప్ప రాజ‌కీయ ఉద్దేశం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News