trump: వాడుండేదిక క్యూబా గ్వాంటనామా బే జైల్లోనే: ట్రంప్ నిప్పులు

  • పట్టుబడిన ఉగ్రవాది జీవితాంతం జైల్లోనే
  • వీసా విధానాన్ని కఠినం చేసి తీరుతాం
  • అమెరికాను సురక్షితం చేయడమే లక్ష్యం
  • స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్

న్యూయార్క్ లో పాదచారులు, స్కూలు పిల్లలపై దారుణాది దారుణంగా ఉగ్రదాడికి పాల్పడిన వాడు సభ్య సమాజంలో నివసించేందుకు తగిన వ్యక్తి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నిన్న ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాదిని క్వూబాలో ఉన్న గ్వాంటనామా బే జైలుకు తరలిస్తామని చెప్పారు. వాడిక జీవితాంతం అక్కడే ఉంటాడని హెచ్చరించారు.

తన వలస విధానమే మంచిదని, ఏ దేశం నుంచి పడితే ఆ దేశం నుంచి వచ్చిన వారికి అనుమతులు, వీసాలు ఇస్తూ పోతుంటే, ఇటువంటి అనర్థాలే జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఇకపై వీసా విధానాన్ని మరింత కఠినం చేసి తీరుతామని అన్నారు. అమెరికాను సురక్షితంగా చేయడమే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.

వైవిధ్య వీసా పథకాన్ని రద్దు చేసే ప్రక్రియను తక్షణం ప్రారంభించేందుకు సహకరించాలని కాంగ్రెస్ ను కోరుతున్నట్టు తెలిపారు. వినడానికే ఆ విధానం బాగుంటుందని, మిగతా దేశాలను ఆకర్షిస్తుందని, కానీ వాస్తవ పరిస్థితుల్లో అది అమెరికాకు నష్టం కలిగించేదేనని అభిప్రాయపడ్డారు. ప్రతిభ ఆధారిత వలస విధానం రావాలన్నదే తన అభిమతమని, అదే దేశాభివృద్ధికి కూడా మేలు చేకూరుస్తుందని చెప్పారు.

More Telugu News