BCCI: పోటీ పడి వైడ్లు వేసిన బౌలర్లు.. సెంచరీ దాటిన వైనం!

  • మణిపూర్-నాగాలాండ్ మహిళల మ్యాచ్‌లో ఘటన
  • ఒకే మ్యాచ్‌లో 136 వైడ్లు నమోదు
  • ఆశ్చర్యపోయిన క్రికెట్ ప్రపంచం

క్రికెట్ మ్యాచ్‌లో వైడ్‌లు ఒక్కోసారి ఫలితాల్ని ప్రభావితం చేస్తుంటాయి. అందుకే బౌలర్లు చాలా జాగ్రత్తగా బంతులు విసురుతుంటారు. ఒక మ్యాచ్‌లో ఆరేడు వైడ్‌లు ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఏకంగా 136 వైడ్లు అంటే.. వినడానికి ఆశ్చర్యమే. అతిశయోక్తిగా ఉన్నా ఇది నిజం. అది కూడా భారత్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బీసీసీఐ ఆధ్వర్యంలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అండర్-19 మహిళల వన్డే టోర్నీ జరుగుతోంది. మణిపూర్-నాగాలాండ్ జట్లు తలపడగా తొలుత బౌలింగ్ చేసిన మణిపూర్ జట్టు ఏకంగా 94 వైడ్లు వేయగా, నాగాలాండ్ జట్టు కూడా ఏమాత్రం తీసిపోకుండా 42 వైడ్లు వేసింది. మొత్తంగా ఒక మ్యాచ్‌లో 136 వైడ్లు నమోదయ్యాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 38 ఓవర్లలో 215 పరుగులు చేయగా అందులో వైడ్ల ద్వారా వచ్చినవే 94 పరుగులు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మణిపూర్ జట్టు 27.3 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. మణిపూర్ చేసిన 98 పరుగుల్లో 42 పరుగులు వైడ్ల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం.

More Telugu News