ramgopal varma: ఈ ప్రపంచంలో అతి గొప్ప పేరు ఇదే: 'మార్క్ శంకర్ పవనోవిచ్'పై స్పందించిన రాంగోపాల్ వర్మ

  • ఇప్పటివరకూ వినని పేరిది
  • భాషలు పుట్టిన తరువాత నేను విన్న అతి గొప్ప పేరు
  • పవన్ కొడుకుపై రాంగోపాల్ వర్మ స్పందన

ఈ ప్రపంచంలో క్రైస్తవం పుట్టక ముందు నుంచి, అసలు మానవులు మాట్లాడుకోగలరా అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్-1 పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా, ఇప్పటివరకూ వినని పేరును తానిప్పుడు విన్నానని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. ఏ పేరు గురించో తెలుసా? పవన్ కల్యాణ్ నాలుగో బిడ్డకు ఆయన పెట్టిన పేరే. తన కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అన్న పేరును పవన్ పెట్టుకోగా, ఈ పేరు అతి గొప్పదని వర్మ తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. భాషలు పుట్టిన తరువాత తాను విన్న పేర్లలో అత్యంత గొప్పది ఇదేనని చెప్పాడు.

More Telugu News