ఉర్దూ రచయిత అబ్దుల్ ఖవీ దస్నావిని డూడుల్ రూపంలో గౌరవించిన గూగుల్

- ఇవాళ అబ్దుల్ ఖవీ దస్నావి 87వ పుట్టిన రోజు
- ఉర్దూ సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవ చేసిన దస్నావి
- పాత తరం ప్రముఖులను కొత్త తరానికి పరిచయం చేస్తున్న గూగుల్
ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రముఖ ఉర్దూ రచయిత అబ్దుల్ ఖవీ దస్నావిని డూడుల్ రూపంలో గూగుల్ గౌరవించింది. ఉర్దూ సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవ చేసిన దస్నావినీ గూగుల్ నవతరానికి మళ్లీ పరిచయం చేసింది. గూగుల్ అనే అక్షరాలను ఉర్దూలో రాసినట్లుగా చూపించింది. బిహార్‌లో దెస్నా గ్రామంలో 1930, నవంబర్ 1న జన్మించిన దస్నావి 'సాత్ తెహ్రీరెన్', 'మోటాల-ఈ-ఖుతూల్', 'గాలిబ్' వంటి రచనలు చేశారు.
