India: సరళతర వాణిజ్యంలో 30 ర్యాంకులు ఎగబాకిన భారత్.. రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్!

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో స్థానాన్ని మెరుగుపరుచుకున్న భారత్
  • అగ్రస్థానంలో న్యూజిలాండ్
  • వెల్లడించిన ప్రపంచ బ్యాంకు

సరళతర వాణిజ్యంలో భారత్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘డూయింగ్ బిజినెస్ 2018: రీఫార్మింగ్ టు క్రియేట్ జాబ్స్’ తాజా జాబితాలో భారత్ వందో స్థానానికి చేరుకుంది. గతేడాది 130వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఏకంగా 30 స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. ఒక ఏడాదిలో ఇన్ని స్థానాలు మెరుగుపడడం ఇదే తొలిసారి.

 పన్ను చట్టాల్లో సంస్కరణలు, లైసెన్సింగ్ విధానం, పెట్టుబడుదారులకు భద్రత, దివాళా చట్టం వంటివి భారత్ ర్యాంకు మెరుగుదలకు దోహదం చేశాయి. టాప్-100లో నిలిచిన భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. మొత్తం 190 దేశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించగా అందులో భారత్ 100వ స్థానంలో నిలిచింది.

ఇక సులభంగా వ్యాపారం చేసుకోగల దేశాల జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్, డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, అమెరికా, బ్రిటన్ దేశాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రష్యా 35వ స్థానంలో, చైనా 78వ స్థానంలో నిలిచాయి. ఇక భారత్‌లో రాష్ట్రాల పరంగా చూస్తే తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 15 స్థానంలో నిలిచింది. 

More Telugu News