isis: మరో పోస్టర్ విడుదల చేసిన ఐసిస్‌... ఈసారి క్రిస్టియానో రొనాల్డో, నేమార్‌ల‌ ఫొటోలు

  • 2018 ర‌ష్య‌న్ ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌ను టార్గెట్ చేసిన ఐసిస్‌
  • పోస్ట‌ర్ల ద్వారా హెచ్చ‌రిస్తున్న ఉగ్ర‌వాద సంస్థ‌
  • భ‌యాందోళ‌న‌లో ఫుట్‌బాల్ ప్ర‌పంచం

జైలు ఊచ‌ల వెన‌క కంట్లో నుంచి ర‌క్తం కారుతున్న మెస్సీ ఫొటోని విడుదల చేసిన త‌ర్వాత, 2018 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌ను టార్గెట్ చేస్తున్న‌ట్లు చెప్పడానికి మ‌రో రెండు పోస్ట‌ర్ల‌ను ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాద సంస్థ తాజాగా విడుద‌ల చేసింది. ఈ ఫొటోల్లో ఫుట్‌బాల్ ఆట‌గాళ్లు క్రిస్టియానో రొనాల్డో, నేమార్‌ల‌ను హింసిస్తున్న‌ట్లుగా చూపించింది. ఈ రెండు ఫొటోలు ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారాయి.

ఒక ఫొటోలో నేమార్‌ను చంప‌డానికి సిద్ధం చేసిన‌ట్లుగా చూపించారు. అదే ఫొటోలో అప్ప‌టికే చనిపోయి ప‌డి ఉన్న మెస్సీని కూడా చూడొచ్చు. ఇక రెండో ఫొటోలో క్రిస్టియానో రొనాల్డోను తీవ్రంగా హింసించ‌డం వ‌ల్ల క‌ళ్ల నుంచి ర‌క్తం కారుతూ ఉండ‌గా, మోకాళ్ల మీద కూర్చోబెట్టి చంప‌డానికి సిద్ధం చేసిన‌ట్లుగా ఉంది. `మీరు చూసేదే నిజం.. మీరు వినేది నిజం కాదు` అనే అర్థం వ‌చ్చేలా ఆంగ్లంలో రాసిన అక్ష‌రాలు ఈ పోస్ట‌ర్‌లో ఉన్నాయి. అయితే ఈ పోస్ట‌ర్ల‌ను చూసి తీవ్ర‌వాదులు ఏం చేయ‌బోతున్నారోన‌ని ఫుట్‌బాల్ ప్ర‌పంచం భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతోంది.

More Telugu News