revant reddy: మూడున్న‌రేళ్ల‌లో రాష్ట్రానికి కేసీఆర్ చేసింది ఏమీలేదు!: ఢిల్లీలో రేవంత్ రెడ్డి

  • తెలంగాణ కోసం 60 ఏళ్ల సుదీర్ఘ‌ పోరాటం జ‌రిగింది
  • తెలంగాణ‌లో నిరుద్యోగం ఇప్పటికీ అలాగే ఉంది
  • రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది
  • తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ని గెలిపిస్తే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది

తెలంగాణ కోసం 60 ఏళ్ల సుదీర్ఘ‌ పోరాటం జ‌రిగింద‌ని, సుమారు 15 వంద‌ల మంది ప్రాణత్యాగం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. తీరా తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌ల క‌ల‌లు నెర‌వేర‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్న కొడంగ‌ల్ నేత‌ రేవంత్ రెడ్డి అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ‌లో నిరుద్యోగం ఇప్పటికీ అలాగే ఉంద‌ని చెప్పారు.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంటే, తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌ని చెప్పారు. తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత త‌మ క‌ష్టాలు తీరుస్తార‌ని సీఎం కేసీఆర్‌ను ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రిని చేశార‌ని, అయితే ప‌రిస్థితి ఏ మాత్రం మార‌లేద‌ని చెప్పారు. నిరుద్యోగులు ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నార‌ని చెప్పారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేద‌ని చెప్పారు. మూడున్న‌రేళ్ల‌లో కేసీఆర్ చేసింది ఏమీలేద‌ని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల క‌ల‌లు నెర‌వేరుతాయ‌ని అన్నారు.

More Telugu News