rajnikanth: ర‌జ‌నీకాంత్ `కాలా` విడుద‌ల పుకార్ల‌కు తెర‌దించిన నిర్మాణ సంస్థ‌

  • జ‌న‌వ‌రిలో విడుద‌ల కావ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసిన వుండ‌ర్‌బార్ ఫిలింస్‌
  • ట్వీట్ చేసిన నిర్మాణ సంస్థ‌
  • పుకార్ల‌కు స్వ‌స్తి చెప్పేందుకేన‌ని వివ‌ర‌ణ‌

పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న `కాలా` చిత్రం విడుద‌ల గురించి రోజుకో పుకారు వ‌స్తున్న నేప‌థ్యంలో వాట‌న్నింటికీ తెర దించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ వుండ‌ర్‌బార్ ఫిలింస్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. రజనీ అల్లుడు ధ‌నుష్ సొంత బ్యాన‌ర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రిలో పొంగ‌ల్ సంద‌ర్భంగా విడుద‌లకావ‌డం లేద‌ని వుండ‌ర్‌బార్ ఫిలింస్ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఓ ట్వీట్ చేసింది.

సినిమా విడుద‌ల గురించి వ‌స్తున్న పుకార్లు, క‌థ‌నాల‌కు స్వ‌స్తి ప‌లికే యోచ‌న‌లో ఈ ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమా పొంగ‌ల్ వ‌ర‌కు సిద్ధం కాలేద‌ని నిర్మాణ సంస్థ స్ప‌ష్టం చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి హ్యూమా ఖురేషీ, న‌టుడు నానా ప‌టేక‌ర్‌లు కూడా న‌టిస్తున్నారు.

More Telugu News