nawajiddin siddiqui: నన్ను క్షమించండి.. నా ఆత్మకథ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నా!: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ

  • 'యాన్ ఆర్డినరీ లైఫ్ 'పుస్తకంలో మాజీ ప్రియురాళ్ల గురించి ప్రస్తావన
  • సిద్ధిఖీపై మండిపడ్డ మాజీ ప్రియురాళ్లు
  • మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమించమని వేడుకున్న సిద్ధిఖీ

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆత్మకథ పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంపై ఆయన మాజీ ప్రియురాళ్లు తీవ్రంగా మండిపడ్డారు. పుస్తకంలో సిద్ధిఖీ చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో, తన ఆత్మకథ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు సిద్ధిఖీ ప్రకటించాడు. పుస్తకంలోని తన జ్ఞాపకాలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

'యాన్ ఆర్డినరీ లైఫ్' పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్ వర్ లకు సంబంధించిన అంశాలను సిద్ధిఖీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ స్పందిస్తూ, పుస్తకం అమ్ముడుపోవడానికి సిగ్గు లేకుండా, అబద్ధపు కథనాలను రాశాడంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ లో నిహారిక ఫిర్యాదు కూడా చేసింది. సిద్ధిఖీ పిచ్చి ఆలోచనలను భరించలేకే... తాను అతనికి దూరమయ్యానంటూ సునీత తెలిపింది. 

More Telugu News