feature phone: ఫీచ‌ర్ ఫోన్ల‌ ఉత్ప‌త్తిని నిలిపివేయ‌డం లేదు... స్ప‌ష్టం చేసిన జియో

  • ఉత్ప‌త్తి నిలిపివేత గురించి వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌న్న కంపెనీ
  • త్వ‌ర‌లోనే రెండో విడ‌త ప్రీ బుకింగ్స్ ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డి
  • `కై` ఓఎస్‌తో ప‌నిచేసే జియో ఫీచ‌ర్ ఫోన్‌

టెలికాం రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో రిల‌య‌న్స్ జియో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఫీచ‌ర్ ఫోన్ ఉత్ప‌త్తుల‌ను నిలిపివేయ‌నుంద‌ని వార్త‌లు వచ్చిన సంగతి విదితమే. అయితే, `ఫ్యాక్ట‌ర్‌ డెయిలీ` అనే మీడియా సంస్థ ప్ర‌క‌టించిన నివేదిక ఆధారంగా వ‌చ్చిన ఈ వార్త‌ల‌న్నీ అవాస్త‌వమ‌ని జియో ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జియో ఫీచ‌ర్ ఫోన్ల మొద‌టి ద‌శ డెలివ‌రీలు తుది స్థాయికి వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లో రెండో విడ‌త ప్రీ బుకింగ్‌కి సంబంధించిన తేదీల‌ను విడుద‌ల చేస్తామ‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం `కై` ఆప‌రేటింగ్ సిస్టం ద్వారా ప‌నిచేస్తున్న జియో ఫీచ‌ర్ ఫోన్ల‌లో చాలా వ‌ర‌కు యాప్స్ ప‌నిచేయ‌డం లేదు. అలాగే ఎయిర్‌టెల్ కూడా ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్టంతో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నుండటంతో పోటీని త‌ట్టుకోలేన‌నే భ‌యంతో జియో ఫీచ‌ర్ ఫోన్ల ఉత్ప‌త్తిని నిలిపివేసింద‌ని `ఫ్యాక్ట‌ర్ డెయిలీ` ప్ర‌చురించింది.

More Telugu News