Youtube: మరో సరికొత్త ఫీచర్‌తో వచ్చేస్తున్న ‘యూట్యూబ్’.. ఇక ఎంచక్కా పాటలు వినేయొచ్చు!

  • యూట్యూబ్ నుంచి త్వరలో మ్యూజిక్ యాప్
  • ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులోకి
  • ఇందులోనూ ఆఫ్‌లైన్ సౌకర్యం

‘యూట్యూబ్’ నుంచి మరో సరికొత్త యాప్ వచ్చేస్తోంది. యూట్యూబ్‌లో  ఇప్పటి వరకు పాటలు వినాలంటే మొబైల్ స్క్రీన్ ఆన్‌లో ఉండాల్సిందే. ఆఫ్ చేస్తే పాటలు ఆగిపోతాయి. ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. ఇందుకోసం ‘యూట్యూబ్ మ్యూజిక్’ అనే యాప్‌ను విడుదల చేసేందుకు యూట్యూబ్ సిద్ధమవుతోంది. ఇందులో మనకు కావాల్సిన పాటను వినొచ్చు. స్క్రీన్ ఆన్‌లో ఉంచకుండానే పాటలు వినే సౌలభ్యం ఇందులో ఉంది. అంతేకాదు స్క్రీన్‌ను లాక్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇతర మ్యూజిక్ యాప్‌లలానే ఇది కూడా పనిచేస్తుందన్నమాట.

యూట్యూబ్‌లానే ఇందులోనూ ఆఫ్‌లైన్ సౌకర్యం ఉండనుంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు కావాల్సిన పాటలను ఆఫ్‌లైన్ చేసుకుని తర్వాత వినొచ్చు. ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ యాప్ ను త్వరలోనే భారత్‌లోనూ ప్రారంభించేందుకు యూట్యూబ్ సిద్ధమవుతోంది. 

More Telugu News