Reliance: జియోకు ఝలక్.. రూ.1349కే స్మార్ట్‌ఫోన్‌తో వచ్చేస్తున్న ఎయిర్‌టెల్

  • ఫోన్ అసలు ధర రూ. 2,849
  • వినియోగదారులకు రెండు విడతలుగా రూ.1500 వెనక్కి
  • ఇష్టం వచ్చిన రీచార్జ్ చేసుకునే వెసులుబాటు

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 4జీ ఫీచర్ ఫోన్‌కు కౌంటర్‌గా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మరో ఫోన్‌ను సిద్ధం చేస్తోంది. దేశీయ మొబైల్ తయారీ సంస్థ సెల్‌కాన్‌తో కలిసి రూ.1349కే స్మార్ట్‌ఫోన్‌ను అందించేందుకు సిద్ధమైంది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్’ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

4 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమొరీ, 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఈ ఫోన్‌లో ఉన్నాయి. అలాగే ఎయిర్‌టెల్ యాప్స్ వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ టీవీ, మై ఎయిర్‌టెల్ యాప్ ప్రీలోడెడ్‌గా రానున్నాయి.
 
 వినియోగదారులు ఈ ఫోన్ కోసం తొలుత రూ.2,849 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ.169 చొప్పున 36 నెలలపాటు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 నెలల తర్వాత ఒకసారి రూ.500, మిగతా 18 నెలలు పూర్తయ్యాక వెయ్యి రూపాయలు వినియోగదారులకు వెనక్కి వస్తాయి. ఈ లెక్కన ఫోన్ రూ.1349కే లభిస్తుందన్నమాట.
 
 అయితే జియోలో ఎప్పటికీ ఒకే రీచార్జ్ ఆప్షన్ కాకుండా వినియోగదారులు తమకు ఇష్టం ఉన్న ప్యాక్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఏ రీచార్జ్ చేసుకున్నా తొలి 18 నెలల్లో మాత్రం తప్పకుండా ఆ మొత్తం విలువ రూ.3 వేలు ఉంటేనే రూ.500 వెనక్కి వస్తుంది. అలాగే మిగతా 18 నెలల్లోనూ అంతే మొత్తం రీచార్జ్ చేసుకున్న వాళ్లకు మరో రూ.1000 వెనక్కి ఇస్తారు. 

More Telugu News