Supreme court: సుప్రీంకోర్టు నా పిటిష‌న్‌ను కొట్టివేయ‌లేదు: మ‌మ‌తా బెన‌ర్జీ

  • అన్నింటికీ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వం నిబంధ‌న‌లు
  • మండిప‌డుతోన్న మ‌మ‌తా బెన‌ర్జీ
  • వ్య‌క్తిగ‌తంగా ఆధార్‌ను స‌వాల్ చేస్తూ పిటిష‌న్ వేయ‌మని సుప్రీంకోర్టు చెబితే అలాగే చేస్తా

అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో పాటు పాన్ కార్డు, మొబైల్ ఫోన్ నంబ‌రు వంటి అన్నింటికీ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వం నిబంధ‌న‌లు పెడుతోన్న నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం ఈ విష‌యంపై అభ్యంత‌రం తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం ఆధార్‌పై కోర్టును ఆశ్ర‌యించడం స‌రికాద‌ని వ్యాఖ్యానించింది.

వ్య‌క్తిగ‌త హోదాలో ఆధార్‌ను స‌వాల్ చేస్తూ పిటిష‌న్ వేయ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై స్పందించిన మ‌మ‌తా బెన‌ర్జీ.. ఈ అంశంపై తాను ప్ర‌భుత్వం త‌ర‌ఫున కాకుండా వ్య‌క్తిగ‌తంగా కోర్టును ఆశ్ర‌యించాల‌ని న్యాయ‌స్థానం చెబితే తాను అదే చేస్తాన‌ని వ్యాఖ్యానించారు. అంతేకానీ, తాము వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

 కాగా, ఆధార్‌కు సంబంధించిన అన్ని పిటిష‌న్‌ల‌ను విచారించేందుకు విస్తృత రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

More Telugu News