varma: ఓట్ల వర్షం కురిపించే 'బాహుబలి' రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ పై నమ్మకం తిరిగొచ్చిందన్న రాంగోపాల్ వర్మ

  • కాంగ్రెస్ పై మళ్లీ నమ్మకం వచ్చింది
  • కాంగ్రెస్ సినిమా హాల్ అయితే...
  • రేవంత్ 'బాహుబలి' సినిమాయే
  • వైరల్ అవుతున్న వర్మ ట్వీట్

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, అతనో 'బాహుబలి' వంటి వ్యక్తని దర్శకుడు రాంగోపాల్ వర్మ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును కొద్ది నిమిషాల క్రితం పెట్టాడు. "రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి 'బాహుబలి'. 'బాహుబలి' బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. నిమిషాల్లో ఈ ట్విట్ వందలాది లైక్స్ తెచ్చుకుంది.

More Telugu News