jet airways: ఢిల్లీ విమానం హైజాక్... పీఓకే తీసుకెళ్లకుంటే చావు కేకలే... బెంబేలెత్తించిన లేఖ!

  • టాయిలెట్ లో లేఖను వదిలిన ఆకతాయి
  • విమానంలో 12 మంది హైజాకర్లున్నారని బెదిరింపు
  • అత్యవసరంగా విమానం దారి మళ్లింపు
  • బెదిరింపు మాత్రమేనని తేల్చిన అధికారులు
  • ముంబై నుంచి ఢిల్లీ వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ లో ఘటన

ఎవరో ఆకతాయి విమానం టాయిలెట్లో దాచిన ఓ లేఖ జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని బెంబేలెత్తించింది. ఈ ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం టాయ్ లెట్లో ఓ లేఖ లభించగా, విమానం హైజాక్ అయిందని, ఇందులో 12 మంది హైజాకర్లు ఉన్నారని, విమానాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు తీసుకెళ్లాలని, కాదని ఢిల్లీలో దింపితే, ప్రయాణికుల చావు కేకలు మాత్రమే వినిపిస్తాయని ఉంది. విమానం కార్గోలో శక్తిమంతమైన బాంబులున్నాయని హెచ్చరించింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, విషయాన్ని గ్రౌండ్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి తెలిపి, వారి సలహా మేరకు విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. అక్కడ ప్రయాణికులందరినీ దింపిన భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా, ఎటువంటి బాంబులూ లేవని తేలింది. ఆపై ఇదో ఆకతాయి పనిగా భావించి, విమానం టేకాఫ్ కు అనుమతిచ్చారు.మొత్తం 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానంలో ఉన్నారని, ముందు జాగ్రత్త కోసమే విమానాన్ని దారి మళ్లించామని జెట్ ఎయిర్ వేస్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

More Telugu News