Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మహేశ్ సరసన మరోసారి రకుల్ 
  • 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' ఆడియో వేడుక 
  • డిసెంబర్లో 'చలో' అంటున్న నాగశౌర్య 
  • 'క్వీన్' రీమేక్ నుంచి ఎమీ జాక్సన్ ఔట్!

*  ఇటీవల 'స్పైడర్' సినిమాలో మహేశ్ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ఆయన పక్కన నటించే అవకాశం కనిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించే చిత్రంలో రకుల్ ని కథానాయికగా తీసుకున్నట్టు తెలుస్తోంది.  
*  నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా అజయ్ వోధిరాల దర్శకత్వంలో రూపొందుతున్న 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' చిత్రం పాటల వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా బిగ్ సీడీలను, ఆడియో సీడీలను ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు.
*  నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న 'చలో' చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కన్నడ భామ రష్మిక మండన ఇందులో నాయికగా నటిస్తోంది.
*  'క్వీన్' చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ ప్రధాన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక వీటిలో ఓ కీలకమైన పాత్రకు ఎమీ జాక్సన్ ను తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అమెరికన్ టీవీ సీరీస్ 'సూపర్ గాళ్' షూటింగులో బిజీ కావడం వల్ల ఎమీ ఈ ప్రాజక్టుకి బై చెప్పిందట.  

More Telugu News