harvey weinstein: హార్వీ వీన్‌స్టెయిన్ నాపై అత్యాచారం చేశాడు... బ‌య‌ట‌పెట్టిన మ‌రో హాలీవుడ్ న‌టి!

  • నేను భ‌యంతో వ‌ణికిపోయే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌లేదు
  • త‌ర్వాత కూడా చాలా సార్లు వేధించాడు
  • చాలా భ‌య‌ప‌డి పోయేదాన్ని

హాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ మీద ఇప్ప‌టికే పలువురు న‌టీమణులు త‌మ‌ను ఏదో ర‌కంగా లైగింక వేధింపుల‌కు గురిచేశాడ‌ని ఆరోపిస్తూ బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అదే బాట‌లో ఇటాలియ‌న్‌-అమెరిక‌న్ న‌టి అన‌బెల్లా షియోరా మాత్రం ఏకంగా త‌న‌ను వీన్‌స్టెయిన్ రేప్ చేశాడ‌ని వెల్ల‌డించింది. 1990 ద‌శ‌కంలో అత్యాచారం చేయ‌డంతో పాటు, ఆ త‌ర్వాత ఏళ్ల త‌ర‌బ‌డి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని పేర్కొంది.

`ఓ రోజు అర్థ‌రాత్రి హార్వీ నా అపార్ట్‌మెంట్‌కి వ‌చ్చాడు. త‌లుపు తీస్తుండ‌గానే నాపై అత్యాచారానికి ప్ర‌య‌త్నించాడు. నేను ఎంత ప్ర‌తిఘ‌టించినా వ‌దిలిపెట్ట‌లేదు. చివ‌రికి నేను భ‌యంతో వ‌ణికి పోయే వ‌ర‌కు అత‌ను నన్ను వ‌దిలిపెట్ట‌లేదు` అని చెప్పింది. ఆ ఘ‌ట‌న‌ త‌ర్వాత నుంచి ప‌డుకునే ముందు ప‌క్క‌నే బేస్‌బాల్ బ్యాట్ ఒక‌టి పెట్టుకోవ‌డం అలవాటు చేసుకున్న‌ట్లు, ఇంటి త‌లుపు తెరుచుకోకుండా ఏదో ఒక‌టి అడ్డం పెట్ట‌డం ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించింది. అప్పుడు గురైన షాక్ నుంచి తేరుకోవ‌డానికి థెర‌పీ కూడా తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది.

`అంద‌రూ మ‌హిళ‌ల్లాగే అప్పుడే ఈ విషయాన్ని బ‌య‌ట‌పెట్టాల్సింది. కానీ అర్థ‌రాత్రి పూట త‌లుపు తీయ‌డం నేను చేసిన త‌ప్పుగా భావించి మిన్న‌కుండిపోయాను. అలాగే నా భ‌విష్య‌త్తు గురించి కూడా భ‌య‌ప‌డ్డాను` అని అన‌బెల్లా అంది. రోజు రాత్రి షూటింగ్ నుంచి వ‌చ్చేస‌రికి త‌న ఫోన్లో హార్వీ మెసేజ్ ఉండేద‌ని, ఎక్క‌డైనా వేడుక‌ల్లో క‌నిపించిన‌పుడు కూడా మీద చేతులు వేయ‌డానికి ప్ర‌య‌త్నించేవాడ‌ని అన‌బెల్లా తెలిపింది.

More Telugu News