ట్రిపులింగ్ వద్దు.. ఆలోచింప‌జేసే ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!

Sat, Oct 28, 2017, 04:07 PM
  • ట్విట్ట‌ర్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న సెహ్వాగ్
  • భార్య‌, కూతురితో పాటు ఓ వ్య‌క్తి ఒకే బైకుపై వెళుతోన్న ఫొటో
  • బేటీ బ‌చావో అంటూ సెహ్వాగ్ ట్వీట్
త‌న‌దైన శైలిలో ట్వీట్లు చేస్తూ ట్విట్ట‌ర్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ ఈ రోజు ఓ ట్వీట్ చేసి అంద‌రినీ ఆలోచింప‌జేశాడు. భార్య‌, కూతురితో పాటు ఓ వ్య‌క్తి ఒకే బైకుపై వెళుతోన్న ఫొటోను పోస్ట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌... 'ట్రిపుల్ సెంచరీ ఓకే, కానీ ట్రిపులింగ్ మాత్రం వద్దు, భేటీ బ‌చావో.. హెల్మెట్లను ధరించండి, ధరించేలా ప్రోత్సహించండి' అని పేర్కొన్నారు.

కాగా, ఈ ఫొటోలో ఉన్న యువ‌తి బైక్ పై తనకు సరిపడా చోటు లేకపోయినా ప్ర‌మాద‌క‌ర స్థితిలో కూర్చుంది. కిందకి ప‌డిపోకుండా త‌న తల్లిని గ‌ట్టిగా ప‌ట్టుకుంది. ఈ ట్వీట్‌ నెటిజ‌న్లను ఆలోచింప‌జేస్తోంది. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement