stephen hawking: స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంత వ్యాసానికి 2 మిలియ‌న్ల వీక్ష‌ణ‌లు

  • ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన వీక్ష‌ణ‌లు
  • ఆన్‌లైన్‌లో పెట్టిన మొద‌టి రోజు సైట్ క్రాష్‌
  • డౌన్‌లోడ్ చేసుకున్న ఐదు ల‌క్ష‌ల మంది

బ్రిటీష్ శాస్త్ర‌వేత్త‌, కాస్మోల‌జిస్ట్ స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంత వ్యాసాన్ని ఇటీవ‌ల కేంబ్రిడ్జి విశ్వ‌విద్యాల‌యం త‌మ ఆన్‌లైన్ రిపాజిట‌రీ పోర్ట‌ల్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్యాసానికి ఇప్ప‌టి వ‌ర‌కు 2 మిలియ‌న్ల‌కు పైగా వీక్ష‌ణ‌లు వ‌చ్చినట్లు బ్రిట‌న్ మీడియా చెబుతోంది. అలాగే వ్యాసాన్ని ఆన్‌లైన్‌లో పెట్టిన మొద‌టి రెండ్రోజుల్లో కేంబ్రిడ్జి వెబ్‌సైట్ చాలా సార్లు క్రాష్ అయిన‌ట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి ఈ వ్యాసాన్ని ఔత్సాహిక శాస్త్ర‌వేత్త‌లు డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు తెలిపారు. దాదాపు ఐదు ల‌క్ష‌ల‌ మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

`ప్రాప‌ర్టీస్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్ యూనివ‌ర్సెస్‌` పేరిట ఉన్న ఈ సిద్ధాంత వ్యాసాన్ని స్టీఫెన్ హాకింగ్ త‌న 25వ ఏట కేంబ్రిడ్జి ట్రినిటీ హాల్లో పీహెచ్‌డీలో భాగంగా రాశారు. 134 పేజీలు ఉన్న ఈ డాక్యుమెంట్లో విశ్వాంత‌రాళాల సిద్ధాంతాల గురించి, విశ్వాన్ని మ‌రో కోణంలో అర్థం చేసుకునే ప‌ద్ధ‌తుల‌ను హాకింగ్ వివ‌రించారు.

More Telugu News