chattishgarh: ఆ జర్నలిస్టు దగ్గరున్న అశ్లీల సీడీలు నకిలీవి: ఛత్తీస్ గఢ్ మంత్రి

  • ఛత్తీస్ గడ్ మంత్రి రాజేష్ మునాత్ అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని ఫోన్ చేసిన జర్నలిస్టు వినోద్ శర్మ
  • ఆ అశ్లీల వీడియోలు నకిలీవని స్పష్టం చేసిన రాజేష్ మునాత్
  • పోలీసుల అదుపులో వినోద్ శర్మ

ఛత్తీస్ గఢ్ మంత్రికి చెందిన అశ్లీల సీడీలు తన వద్ద ఉన్నాయని ప్రకటించిన జర్నలిస్టు అరెస్టు కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఛత్తీస్ గఢ్ మంత్రి రాజేష్ మునాత్ కి సంబంధించిన అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ పాత్రికేయుడు వినోద్ శర్మ ప్రకటించారు. దీనిపై రాజేష్ మునాత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియోలు ఉన్నాయని చెబుతూ వినోద్ శర్మ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజేష్ మునాత్ మాట్లాడుతూ, వినోద్ శర్మ దగ్గర ఉన్నాయని చెబుతున్న అశ్లీల సీడీలు నకిలీవని అన్నారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు. దీనిపై ఏ స్వంతంత్ర సంస్థతో దర్యాప్తు నిర్వహించినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. 

More Telugu News