whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌... పొర‌పాటున పంపిన సందేశాల‌ను తొల‌గించే అవ‌కాశం

  • ప్ర‌స్తుతం కొద్దిమందికే అందుబాటులో
  • ద‌శ‌ల వారీగా `మెస్సేజ్ రీకాల్‌` ఫీచ‌ర్ అమ‌లు
  • గ్రూప్‌లో పెట్టిన సందేశాల‌ను కూడా తొల‌గించే స‌దుపాయం

రోజుకో కొత్త ఫీచ‌ర్ ప్ర‌వేశ‌పెడుతూ ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1 బిలియ‌న్ యూజర్ల‌ను సంపాదించుకున్న వాట్సాప్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. `మెస్సేజ్ రీకాల్` పేరుతో వ్య‌క్తిగతంగా గానీ, గ్రూప్‌లో గానీ పొర‌పాటున పంపిన మెసేజ్‌ల‌ను తొల‌గించే అవ‌కాశాన్ని ఈ ఫీచ‌ర్ ద్వారా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌యోగాత్మ‌కంగా కొంత‌మంది యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసింది. వారి ఫీడ్‌బ్యాడ్ ఆధారంగా ద‌శ‌ల వారీగా దీన్ని అమ‌లు చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

పొర‌పాటున పంపే మెసేజ్‌ల వ‌ల్ల క‌లిగే ఇబ్బందుల‌ను తొల‌గించడానికి వాట్సాప్ ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇటీవ‌ల లైవ్ లొకేష‌న్ పేరుతో కూడా ఓ ఫీచ‌ర్ ప్రవేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. కొత్త వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. కేవ‌లం టెక్ట్స్‌ సందేశాలు మాత్ర‌మే కాకుండా ఫొటోలు, జిఫ్‌ ఫైల్స్‌, వీడియోలు, కాంటాక్ట్‌లను కూడా ఈ ఫీచర్‌ ద్వారా రీకాల్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచ‌ర్ ప‌నిచేయాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. గ్రూప్‌లో మెసేజ్‌ల‌ను మాత్రం ఎవ‌రూ చ‌ద‌వ‌క‌ముందే రీకాల్ చేసుకోవాలి. ఒక్క‌రు చ‌దివినా ఆ సందేశాన్ని రీకాల్ చేసుకోలేరు. మనం పంపిన సందేశాల‌ను ఎడిట్ చేసుకునే అవ‌కాశాన్ని కూడా వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News