blue whale game: బ్లూ వేల్ గేమ్ పై టీవీ ఛాన‌ళ్లు అవగాహనా కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేయాలి... సుప్రీం ఆదేశం

  • ఈ ఆట‌ను జాతీయ స‌మ‌స్య‌గా అభివ‌ర్ణించిన ధ‌ర్మాస‌నం
  • మూడు వారాల్లోగా నిషేధానికి సంబంధించిన నివేదిక ఇవ్వాల‌ని కేంద్రానికి ఆదేశం
  • ఇత‌ర ప్ర‌మాద‌క‌ర గేమ్‌ల‌ను కూడా నియంత్రించాల‌ని తీర్పు

టీనేజ‌ర్ల ప్రాణాల‌ను బ‌లిగొంటున్న బ్లూ వేల్ స్మార్ట్‌ఫోన్ గేమ్‌ను భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం జాతీయ స‌మ‌స్య‌గా అభివ‌ర్ణించింది. దీని నిషేధానికి సంబంధించి మూడు వారాల్లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా దూర‌ద‌ర్శ‌న్‌తో పాటు ఇత‌ర ప్రైవేటు టీవీ ఛాన‌ళ్లు కూడా ఈ ప్ర‌మాద‌క‌ర‌ గేమ్‌ విషయంలో అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చ‌డానికి కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేయాల‌ని ఆదేశించింది.

ఈ గేమ్‌ను నియంత్రించ‌డంపై కొంత‌మంది నిపుణులు అధ్య‌య‌నం చేస్తున్నార‌ని, త్వ‌ర‌లో వారు ఓ ప‌రిష్కారాన్ని సూచిస్తార‌ని కేంద్రం కోర్టుకు విన్న‌వించుకుంది. దీంతో పాటు ఇత‌ర భ‌యంక‌ర గేమ్‌లైన `చోకింగ్ గేమ్‌`, `సాల్ట్ అండ్ ద ఐస్ ఛాలెంజ్‌`, `ఫైర్ ఛాలెంజ్‌`, `ఐ బాల్ ఛాలెంజ్‌` వంటి గేమ్‌ల‌పై కూడా నియంత్ర‌ణ విధించాల‌ని సుప్రీంకోర్టు తెలిపింది. బ్లూ వేల్‌ గేమ్ కార‌ణంగా ఇప్ప‌టికీ ప్రపంచ‌వ్యాప్తంగా 100 మందికి పైగా టీనేజ‌ర్లు మృత్యువాత ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. 50 రోజుల్లోగా ఇచ్చిన టాస్క్‌లు పూర్తిచేయాల‌ని చెప్పే ఈ గేమ్ చివ‌రి లెవె‌ల్లో త‌మ ద‌గ్గ‌రి వాళ్ల‌ను చంప‌డం గానీ, ఆత్మ‌హ‌త్య గానీ చేసుకోవాల‌ని ప్రేరేపిస్తుంది.

More Telugu News